Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

లాక్ డౌన్‌తో ర‌క్త దాత‌ల కొర‌త‌.. ప్రాణాలు కాపాడ‌మ‌ని మెగాస్టార్ పిలుపు

Written By శ్రీ
Updated: సోమవారం, 20 ఏప్రియల్ 2020 (22:41 IST)
క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల ధీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లున్న పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ర‌క్తం అవ‌స‌రం ప‌డేవారికి లాక్ డౌన్ పెను స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. బ్ల‌డ్ బ్యాంక్స్‌లో ర‌క్త నిల్వ‌లు అడుగంట‌డంతో ఆస్ప‌త్రి వ‌ర్గాల్లోనూ తీవ్ర‌ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌జ‌లు అభిమానులు విరివిగా ర‌క్త‌దానం చేయాల‌ని అందుకు స‌మీప బ్ల‌డ్ బ్యాంక్స్‌కి వెళ్లాల‌ని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. 
 
ఆయ‌న హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌కి ఆదివారం ఉదయం స్వయంగా వచ్చి ర‌క్త‌దానం ఇచ్చారు. చిరంజీవితో స‌హా హీరో శ్రీ‌కాంత్- రోష‌న్, శ్రీ‌మిత్ర చౌద‌రి.. వారి వార‌సులు తేజ్ నివాస్, తేజ్ గోవింద్, బెన‌ర్జీ, నటుడు భూపాల్, గోవింద‌రావు, విజ‌య్, సురేష్ కొండేటి త‌దిత‌రులు ర‌క్త‌దానం చేసిన వారిలో ఉన్నారు.
 
ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-``లాక్ డౌన్ వేళ ర‌క్త దాత‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. ర‌క్తం ఇచ్చేవారు లేక‌ కొర‌త ఎక్కువ‌గా ఉంది. పేషెంట్స్ చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. త‌ల‌సేమియా-క్యాన్సర్ వ్యాధిగ్ర‌స్తులు.. బైపాస్ స‌ర్జ‌రీ - హార్ట్ రోగులు.. ప్ర‌మాదాల‌కు గురైన వారు.. ఎనీమియా వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ర‌క్తం లేక ఇబ్బంది ప‌డుతున్న వారిని ఆదుకునేందుకు ప్ర‌జ‌లు అభిమానులు ముందుకు రావాలి. 
 
మీకు స‌మీపంలో ఉన్న బ్ల‌డ్ బ్యాంక్స్‌కి ర‌క్త‌దానం చేయండి. స్వ‌చ్ఛందంగా ర‌క్త‌దానం చేస్తే ప్రాణ‌దానం చేసిన‌వారు అవుతారు. ఈ బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంది. ర‌క్తం దొర‌క్క చ‌నిపోతున్నార‌నే ప‌రిస్థితి రాకుండా కాపాడండి. బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండి. త‌మ్ముడు శ్రీ‌కాంత్.. మిత్రుడు శ్రీ‌మిత్ర చౌద‌రి.. వారి స్నేహితులు వ‌చ్చి ర‌క్త‌దానం ఇచ్చి స్ఫూర్తి నింపారు. దీనిని ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని ఇరు తెలుగు రాష్ట్రాల్లో నా అభిమానులు ర‌క్త‌దానం చేయాల‌ని కోరుతున్నాను. 
 
లాక్ డౌన్ ఉన్నా ర‌క్త‌దానం చేయొద్ద‌ని ఎవ‌రూ ఆప‌రు. బ‌య‌ట పోలీసుల వ‌ల్ల ఏ ఇబ్బందీ త‌లెత్త‌దు. ర‌క్త‌దానం చేస్తున్నాం అని తెల‌ప‌గానే బ్ల‌డ్ బ్యాంక్ వారి నుంచి మీ ఫోన్ వాట్సాప్‌కు పాస్ వ‌స్తుంది. అది పోలీసుల‌కు చూపిస్తే స‌రిపోతుంది`` అని తెలిపారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments