ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 25 మే 2023 (13:05 IST)

మేమ్ ఫేమస్ అద్భుతమైన చిత్రంగా మహేష్ బాబు కితాబు

Mahesh Babu
Mahesh Babu
మహేష్ బాబు తన తాజా సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్నాడు. ఇటీవలే సమ్మర్ టూర్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఇదిలా ఈనెల 26న విడుదల కానున్న మేమ్ ఫేమస్ చిత్రాన్ని నిన్న నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ లు మహేష్ బాబుకు సినిమా ప్రదర్శించారు. 
 
అనంతరం మహేష్ బాబుమాట్లాడుతూ, సినిమాలోని ప్రతి నటీనటులు, ముఖ్యంగా రచయిత, దర్శకుడు,  నటుల నటన నన్ను  అబ్బురపరిచారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్ గా కూర్చున్నాయి. కొంత మంది అరంగేట్రం ఈ చిత్రాన్ని నిర్మించారని నమ్మలేకపోతున్నా. సుమంత్ ప్రభాస్ ఎంత ప్రతిభ కనబరిచాడో అంటూ.. ట్వీట్ చేసాడు. టేలెంట్ ను ప్రోత్సాహించిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు