బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 22 మే 2023 (17:31 IST)

మేమ్ ఫేమస్ కు యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్‌

Sumanth Prabhas, Mani Egurla, Maurya Chaudhary, Sarya, Siri Rasi
Sumanth Prabhas, Mani Egurla, Maurya Chaudhary, Sarya, Siri Rasi
లహరి ఫిల్మ్స్,చాయ్ బిస్కెట్ ఫిలింస్ రెండోసారి కలసి చేస్తున్న ‘మేమ్ ఫేమస్’ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రోలో నటిస్తూ దర్శకత్వ వహించిన తొలి చిత్రం.  మంచి విలేజ్ ఫన్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రంలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర ప్రధాన తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించారు.
 
పాజిటివ్ బజ్‌ తో దూసుకెళుతున్న ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 2:29:59 సినిమా రన్‌టైమ్ లాక్  చేశారు. ఇందులోనే టైటిల్ క్రెడిట్‌లు, కమర్శియల్స్ ఉంటాయి. ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా హిలేరియస్ వినోదం కూడుకున్నదని ప్రమోషనల్ కంటెంట్ సూచించినప్పటికీ, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను కూడా సమానంగా మెప్పిస్తుంది. దీనికి తగిన భావోద్వేగాలు కూడా ఉంటాయి.
 
 సుమంత్ ప్రభాస్  చాలా సమర్ధవంతంగా హ్యాండిల్ చేసాడు. అతని రైటింగ్ మేజర్ అసెట్. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ , కళ్యాణ్ నాయక్ సంగీతం ఇతర పాజిటివ్ అంశాలు.
ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ని, బండనర్సంపల్లిలో పాత్రలతో వారు తిరుగుతున్న ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది.
మే 26న మేమ్ ఫేమస్ థియేటర్లలో విడుదల కానుంది.