గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (14:52 IST)

#రిచా గంగోపాధ్యాయ పెళ్లి- ప్రభాస్ హీరోయిన్‌ మెడలో మూడు ముళ్లు

రానా నటించిన ''లీడర్'' మూవీలో నటించిన రిచా గంగోపాధ్యాయ తెలుగు ప్రేక్షకుల సుపరిచితమే. వెంకటేష్ నటించిన నాగవల్లి, రవితేజతో విరపకాయ్, బాహుబలి ప్రభాస్‌తో సరసన మిర్చి వంటి చిత్రాల్లో నటించారు. ఈమె ప్రస్తుతం పెళ్లి కూతురైంది. రిచా వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. వాషింగ్టన్‌కు చెందిన జో అనే వ్యక్తిని రిచా పెళ్లి చేసుకున్నారు.
 
ఈ సందర్భంగా రిచా పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రిస్టియన్‌, హిందూ మత సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుకలో తీసిన ఫొటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
కాగా, తమిళం, బెంగాళీలోని పలు చిత్రాల్లో రిచా నటించారు. కాగా, 2018 తర్వాత ఉన్నత చదువుల కోసం వాషింగ్దన్‌ వెళ్లారు. దీంతో కొంత కాలంగా ఆమె సినిమాకు దూరంగా ఉంది. అక్కడ తన తోటి విద్యార్థి జోతో ప్రేమలోపడ్డారని, ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని రిచా తెలిపారు. ప్రస్తుతం ఆమె వివాహం కూడా జరిగింది.