ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (18:01 IST)

ఎంఎం కీరవాణి ఇంటి విషాదం.. తల్లి భానుమతి ఇకలేరు..

keeravani
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి భానుమతి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమెకు ఇంటి పట్టునే చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, మూడు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
 
కాగా, భానుమతి భౌతికకాయాన్ని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నివాసానికి తరలించారు. రాజమౌళికి భానుమతి పెద్దమ్మ అవుతారు. పైగా, ఆయనకు ఆమె అంటే అమితమైన ఇష్టం. మరోవైపు, మాతృవియోగం పొందిన కీరవాణికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.