సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (14:55 IST)

సావిత్రి మానవత్వానికి ప్రతీక -''మహానటి'' మూగమనసులు పాట (Video)

''మహానటి'' సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తోంది. సావిత్రి జీవిత చరిత్రను దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించారు. ఈ సినిమాపై నిర్మాత స్వప్నదత్ మాట్ల

''మహానటి'' సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తోంది. సావిత్రి జీవిత చరిత్రను దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించారు. ఈ సినిమాపై నిర్మాత స్వప్నదత్ మాట్లాడుతూ.. సావిత్రి గొప్పతనాన్ని మహానటి సినిమా చాటిచెప్తుందన్నారు. సావిత్రి ఎంత గొప్ప నటీమణో.. అంతకంటే మంచి మనసున్న వ్యక్తి అంటూ కొనియాడారు. 
 
సావిత్రి మానవత్వానికి ప్రతీక అని.. ఎదుటివారి కష్టం చూసి వెంటనే కరిగిపోయేవారన్నారు. సావిత్రి వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలను ఆమె కుటుంబసభ్యుల ద్వారా సన్నిహితులు, సహనటుల ద్వారా తెలుసుకుని సినిమాను తెరకెక్కించామన్నారు. సమంత, దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్, మోహన్ బాబు, ప్రకాశ్ రెడ్డి, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కనులతో వేచి చూస్తున్నారు. 
 
కాగా ఇప్పటికే మహానటి సినిమా పోస్టర్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా 'మూగమనసులు .. మూగమనసులు' అనే పాటను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. ఈ ఇద్దరూ ప్రేమలోపడిన సందర్భంలో ఈ పాట రానుందని సమాచారం. సిరివెన్నెల సాహిత్యం, మిక్కీ జె. మేయర్ సంగీతం, శ్రేయ ఘోషల్ స్వరం మనసు తలుపు తట్టేలా వున్నాయి. అద్భుతమైన సెట్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటను మీరూ ఓసారి వినండి.