1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (10:21 IST)

మురళీ మోహన్ ప్రారంభించిన అంతేనా..ఇంకేం కావాలి చిత్రం

Clap by muralimohan
Clap by muralimohan
అమ్మ కిచ్చిన మాటను ,అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం "అంతేనా..ఇంకేం కావాలి".పవన్ కళ్యాణ్ బయ్యాను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ హై బ‌డ్జెట్‌తో శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై వెంకట నరసింహా రాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి " ఝాన్వీ శర్మ  హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం రోజున హైద‌రాబాద్‌ లోని రామానాయుడు స్టూడియో లో సినీ అతిరధుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య  అతిథులుగా వచ్చిన సీనియర్ నటులు మురళీ మోహన్ గారు హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్ ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ అందించారు.  
 
నటుడు  దగ్గుపాటి అభిరామ్ మాట్లాడుతూ..వెంకట నరసింహ రాజ్ , రవీంద్ర బాబు లు మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీని ని సెలెక్ట్ చేసుకొని తీస్తున్న "అంతేనా.. ఇంకేం కావాలి" సినిమా గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.
 
చిత్ర దర్శకుడు వెంకట నరసింహ రాజ్ మాట్లాడుతూ...ఈ కార్యక్రమానికి వచ్చిన మురళీ మోహన్ గారికి, దగ్గుపాటి అభిరామ్ గారికి ధన్యవాదములు. నేను వెంకటేష్ బాబు కు వీరాభిమానిని. ఎప్పటికైనా వెంకటేష్ గారితో సినిమా చెయ్యాలనే పట్టుదల ఉండడంతో నా గురువుగారు ఆర్. నారాయణ మూర్తి ఆశీస్సులతో నేను డైరెక్టర్ అయ్యాను.ఈ బ్యానర్ లో ప్రస్తుతం "అల్లుడు బంగారం "సినిమా షూటింగ్ జరుగుతుంది. .ఇప్పుడు చేస్తున్న "అంతేనా..ఇంకేం కావాలి" నా రెండవ సినిమా.ఈ సినిమా విషయానికి వస్తే ఇది తల్లీ కొడుకుల సెంటిమెంట్ ఉన్న సబ్జెక్టు , అమ్మ కిచ్చిన మాటను , అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనేదే ఈ కథాంశం.మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ ని నిర్మాత రవీంద్ర బాబు తో కలసి ఈ సినిమా చేస్తున్నాను . నెక్స్ట్ మంత్ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న ఈ సినిమాను  సింగిల్ షెడ్యూల్ లో పూర్తి  చే య డానికి ప్లాన్ చేస్తున్నాము .ఈ సినిమాలో సీనియర్ నటులు సుమన్,కమెడియన్ సునీల్, బ్రహ్మాజీ, కరాటే కళ్యాణ్,జబర్దస్త్ టీం ,గబ్బర్ సింగ్ టీం నటిస్తున్నారు.వీరితో పాటు ఇంకా చాలా మంది ఆర్టిస్టులకు అవకాశం కల్పిస్తున్నాము. మాకు ఈ సినిమాకు మంచి టెక్నిషియన్స్  దొరికారు. ఫుల్ ఔట్ ఔట్ కామెడీ,ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు
 
చిత్ర నిర్మాత రవీంద్ర బాబు మాట్లాడుతూ..ఇక్కడకు వచ్చిన , పెద్దలకు ధన్య వాదములు. వెంకట నరసింహ రాజ్ గారు నాకు ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ కథ చెప్పగానే ఈ కథ నాకు బాగా నచ్చింది. తన ద్వారానే నేను నిర్మాతగా పరిచయ మవుతున్నాను.శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై  మేమంతా కలసి నిర్మిస్తున్నాము. ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. కామెడీ, లవ్, సెంటిమెంట్ వంటి కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
చిత్ర హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ “అంతేనా ఇంకేం కావాలి ” ఈ చిత్రంలో లో కామెడీ,లవ్, సెంటిమెంట్ ఉంటుంది. ఇలాంటి  మంచి సినిమా లో  నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
 
హీరోయిన్ ఝాన్వీ శర్మ  మాట్లాడుతూ.. ఇది నా నాలుగవ సినిమా. ప్యూర్ లవ్ స్టోరీ సబ్జెక్టు లో హీరోయిన్ గా నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
 
నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రవీంద్ర బాబు వెంకట నరసింహ రాజ్ లు చేస్తున్న సినిమా కథ చాలా బాగుంది. మంచి నటీ నటులు, టెక్నిషియన్స్ ను సెలక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమాలో నాకు మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు దర్శక, నిర్మాతలు కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నాకు మంచి పోలీస్  పాత్ర ఇచ్చారు.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు .
 
ఇంకా ఈ కార్యక్రమంలో  పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.