బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (13:00 IST)

అల్లు అర్జున్‌తో తలపడేది అతనే.. పుష్ప విలన్ ఖరారు

లెక్కల మాస్టారుగా గుర్తింపు పొందిన దర్శకుడు కె.సుకుమార్ - హీరో అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో కథ సాగుతుంది. పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప' రూపొందుతున్న ఈ చిత్రంలో ఎర్రచందనం కలపను అక్ర‌మంగా రవాణా చేసే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో విల‌న్ ఎవ‌రన్న విష‌యాన్ని ఆ సినిమా యూనిట్ ఈ రోజు ప్ర‌క‌టించింది.  
 
మలయాళ నటుడు ఫవాద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు చెబుతూ ఆయ‌న ఫొటోను మైత్రిమూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నట్టు అప్ప‌ట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రాజెక్టు నుంచి విజ‌య్ సేతుప‌తి తప్పుకున్నారు. 
 
కేర‌ళ‌లో అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. అందుకే ఈ సినిమా కోసం మ‌ల‌యాళ న‌టుడినే విల‌న్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బ‌న్నీ ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తోన్న ఈ సినిమా ఆగ‌స్టు 13న విడుద‌ల కానుంది.

 
\