సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2023 (18:36 IST)

నాగార్జున చిత్రం నా సామి రంగలో ఆషికా రంగనాథ్‌ పరిచయం

Ashika Ranganath
Ashika Ranganath
నాగార్జున అక్కినేని తన తాజా చిత్రం 'నా సామి రంగ'తో మరో నూతన దర్శకుడు విజయ్ బిన్నీకి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ కథానాయికగా నటిస్తుండగా, ఈరోజు మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
 
పోస్టర్ ద్వారా 'వరలక్ష్మి'గా పరిచయమైన ఆషికా రంగనాథ్ సాంప్రదాయ దుస్తులలో ఆభరణాలతో ఆకర్షణీయంగాఉంది.  ఆషికా అద్దం ముందు నిల్చుని, బీడీ తాగుతూ బయటి నుంచి తనను గమనిస్తున్న నాగార్జునను అనుకరిస్తున్నట్లు మేకర్స్ ఒక గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఇందులో దూరం నుండి ఒకరినొకరు మెచ్చుకుంటూ కనిపించడం చాలా డిలైట్ ఫుల్ గా వుంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి తన స్పెల్‌బైండింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మెస్మరైజ్ చేశారు.  
 
నాగార్జున మ్యాసీ గా కనిపించగా, ఆషికా రంగనాథ్ హాఫ్ శారీలో అచ్చ తెలుగు అమ్మాయి లుక్ లో ఆకట్టుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా ఉన్న విజయ్ బిన్నీ ఆషికను చాలా చక్కని హావభావాలతో ప్రజెంట్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు
 
నాగార్జున, కీరవాణి, చంద్రబోస్‌ ఈ చార్ట్‌బస్టర్ కాంబినేషన్‌లోని ఆల్బమ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు  
 
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి మ్యాసివ్ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
 
బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. ‘నా సామి రంగ’ 2024 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది.