సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (11:42 IST)

సినిమాలో పాత్రకోసం ఏం చేయడానికైనా సిద్దం : యంగ్ హీరోయిన్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ హీరోయిన్లలో నభా నటేశ్ ఒకరు. తన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన భామ. ఇటీవల "అదుగో" అనే చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు కనిపించింది. ఈమె తాజాగా చేసిన ఓ ప్రకటన టాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది.
 
సినిమాల్లో తన పాత్రలపై ఆమె స్పందిస్తూ, సినిమాల్లో తనకు వచ్చే పాత్రల కోసం ఏం చేయాడానికైనా సిద్ధమే. ఇందుకోసం ఎంతైనా శ్రమిస్తా. ఇటీవల ఓ కన్నడ చిత్రం కోసం ఎంతో కష్టమైన గుర్రపు స్వారీని నేర్చుకున్నట్టు చెప్పారు. అలాగే, ఓ సన్నివేశంలో బీడీ తాగాల్సివస్తే నిజంగానే బీడీలు తాగినట్టు చెప్పుకొచ్చింది. 
 
వాస్తవానికి ఆ సన్నివేశంలో గ్రాఫిక్స్ ఉపయోగించి మేనేజ్ చేద్దామని దర్శకుడు చెప్పాడు. కానీ, తనకు అలా చేయడం ఇష్టంలేక నిజంగానే బీడీ తాగడం నేర్చుకుని ఆ సన్నివేశంలో నటించినట్టు చెప్పారు. ఆ బీడీ తాగినన్ని రోజులు భోజనం చేసే సమయంలో వాంతి వచ్చినట్టుగా ఉండేదని అలా ఆ పాత్రకు న్యాయం చేసినట్టు నభా నటేశ్ వెల్లడించారు.