శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 జులై 2018 (12:36 IST)

#nagachaitanya #ShailajaReddyAlludu ఫస్ట్ లుక్ రిలీజ్ (ఫోటో)

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, చైతూకు జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. గతంలో వచ్చిన నాగార్జ

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, చైతూకు జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. గతంలో వచ్చిన నాగార్జున సినిమా.. అల్లరి అల్లుడు మాదిరే ఇది కూడా కామెడీ, రొమాన్స్ కలబోతగా ఉండబోతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సోమవారం సోషల్ మీడియాలో సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ, ఆమె కూతురుగా అనూ ఇమ్మాన్యుయేల్ చైతూ కనిపిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 
 
కాగా, యుద్ధం శరణం సినిమా ప్లాప్ తర్వాత నాగ చైతన్య కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి శైలజా రెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్ ఎలా వుందో ఓ లుక్కేయండి.