గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (17:22 IST)

నాగ శౌర్య రంగబలి టీజర్ వచ్చేసింది

Naga Shaurya
Naga Shaurya
హీరో నాగశౌర్య హోల్ సమ్ ఎంటర్ టైనర్ ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. యుక్తి తరేజా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు మేకర్స్ అన్ని ప్రధాన పాత్రలు, బ్యాక్‌డ్రాప్‌ ను పరిచయం చేస్తూ సినిమా టీజర్‌ ను విడుదల చేశారు.
 
దూకుడు స్వభావం, లోకల్ ఫీలింగ్స్ వున్న హీరో చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటాడు. తనని అందరూ విమర్శిస్తుంటే హీరోయిన్ మాత్రం తను చాలా సాఫ్ట్  అని భావిస్తుంది. హీరో తండ్రికి మెడికల్ షాప్ ఉంది. కానీ హీరోకి మెడిసిన్ కి సంబధించిన బేసిక్స్ కూడా తెలియవు. హీరోయిన్ వృత్తిరీత్యా డాక్టర్.
 
నాగశౌర్య ఈ పాత్రను చాలా యీజ్ తో డైనమిక్ గా పోషించారు. గోదావరి యాసలో డైలాగులు చెప్పి అలరించారు. యుక్తి తరేజా కూల్‌ గా కనిపించింది. సత్య, సప్తగిరి, ఇతర హాస్యనటుల తగిన వినోదాన్ని పంచారు. ఇందులో షైన్ టామ్ చాకో పాత్రను కూడా పరిచయం చేశారు.
 
వినోదం, రొమాన్స్‌తో పాటు యాక్షన్‌ కూడా ఉంటుంది. పవన్ బాసంశెట్టి అన్ని కమర్షియల్ హంగులతో కూడిన చిత్రంతో ముందుకు వచ్చారు. ఈ చిత్రం అన్ని వర్గాల  ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకునేలా చూసుకున్నారు .ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణ విలువలు గ్రాండ్ గా ఉన్నాయి. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ, పవన్ సిహెచ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. టీజర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది.
 
ఈ చిత్రానికి ఎడిటర్‌ కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎఎస్‌ ప్రకాష్‌. ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
నటీనటులు: నాగ శౌర్య, యుక్తి తరేజ, సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో తదితరులు.