శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 15 డిశెంబరు 2018 (16:42 IST)

ఎబిసిడి చిత్రంలో అల్లు శిరీష్ తండ్రి పాత్ర‌లో నాగబాబు..

కంటెంట్ వున్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పైన యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాల నటుడు భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ధీరజ్ మొగిలినేని కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 
 
ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మలయాళంలో సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండడంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. 2.5 కోట్లకు గోల్డ్ మైన్ ఫిల్మ్స్ హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. ఈ చిత్రం చివ‌రి షెడ్యూల్ జ‌ర‌పుకుంటుంది. ఇదిలావుండ‌గా ఎబిసిడి చిత్రానికి మ‌రో పాజిటివ్ సైన్ తోడ‌య్యింది. 
 
మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు హీరో తండ్రిగా న‌టించిన గీతాగోవిందం, అర‌వింద స‌మేత చిత్రాలు మంచి విజ‌యాలు సాధించాయి. ఇప్ప‌ుడు అల్లు శిరీష్‌కి ఫాద‌ర్‌గా నాగ‌బాబు నటించ‌టం యూనిట్ అంద‌రికి సంతోషాన్ని క‌లిగించింది. 
 
ఈ సంద‌ర్బంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ..  మొద‌టిగా మా ఎబిసిడి చిత్రంలో నాకు ఫాద‌ర్‌గా న‌టిస్తున్న నాగబాబు గారికి నా ధ‌న్య‌వాదాలు. నాగ‌బాబు గారితో ఇది నా మొద‌టి చిత్రం. నాకు రియల్ లైఫ్ అంకుల్.. ఇప్పుడు రీల్ లైఫ్ ఫాదర్‌గా నటిస్తున్నారు. నేను ఈ చిత్ర కథ విన్నప్పుడే తండ్రి పాత్రలో నాగబాబు గారిని తప్ప వేరొకరిని ఊహించుకోలేకపోయాను. అనుకున్నట్టుగానే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. 
 
ఆయనతో కలిసి నటిస్తున్న సీన్స్‌లో చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మా మెగా ఫ్యామిలీ హీరోల‌తో మొద‌టిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా ఎబిసిడి చిత్రం ఘన మంచి విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాను అని అన్నారు. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ -జుధా సాంధీ, కో-ప్రొడ్యూసర్- ధీరజ్ మొగిలినేని బ్యానర్స్- మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్, నిర్మాతలు - మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని, దర్శకుడు - సంజీవ్ రెడ్డి.