ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: గురువారం, 31 మే 2018 (20:35 IST)

అక్కినేని బ‌యోపిక్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగ్

సావిత్రి బ‌యోపిక్ తెరపైకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి... ఎ.ఎన్.ఆర్ బ‌యోపిక్ రాబోతుంద‌ట‌. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి అంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే... ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పైన నాగ్ క్లారిటీ ఇచ్చారు. తన తాజా సినిమా ‘ఆఫ

సావిత్రి బ‌యోపిక్ తెరపైకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి... ఎ.ఎన్.ఆర్ బ‌యోపిక్ రాబోతుంద‌ట‌. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి అంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే... ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పైన నాగ్ క్లారిటీ ఇచ్చారు. తన తాజా సినిమా ‘ఆఫీసర్’ ప్రమోషన్లో ఉన్న నాగార్జున ఏఎన్నార్ బయోపిక్ గురించి మాట్లాడారు. తన తండ్రి బయోపిక్ ప్రతిపాదన ఏమీ లేదని తేల్చేసాడు.
 
ఇంకా ఈ బ‌యోపిక్ గురించి ఏం చెప్పారంటే... ‘మా నాన్న జీవితం అందంగా, ఆదర్శవంతంగా సాగింది. అలాంటి కథను జనాలకు చూపిస్తే నచ్చుతుందా? వాళ్లకు కొంచెమైనా నెగిటివ్ టచ్ ఉండాలి కదా? ఆయన కెరీర్‌లో డౌన్ ఫాల్ లేదు. బతికినంతకాలం ఆనందంగా బతికారు. ఐదుగురు పిల్లలకు గుడ్ బై చెబుతూ వెళ్లిపోయారు. ఆయన కథ సినిమాగా కన్నా పుస్తకంగా వస్తే బాగుంటుంది..’ అంటూ త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టారు కింగ్ నాగార్జున‌.