శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (14:02 IST)

పవన్ కల్యాణ్ అందుకోలేని రికార్డును నాగ్ సొంతం.. ట్విట్టర్‌లో 20లక్షల మంది ఫాలోయర్లతో?

వినూత్న రికార్డును నాగార్జున సొంతం చేసుకున్నాడు. ఇంకా లక్షలాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ అందుకోలేని రికార్డును కూడ నాగార్జున సొంతం చేసుకోవడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్

వినూత్న రికార్డును నాగార్జున సొంతం చేసుకున్నాడు. ఇంకా లక్షలాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ అందుకోలేని రికార్డును కూడ నాగార్జున సొంతం చేసుకోవడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ సెలెబ్రిటీలు సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నాగార్జున కూడ ట్విట్టర్ ఎకౌంట్‌ను ఓపెన్ చేసి తరుచు తన అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. అయితే అనూహ్యంగా నాగార్జున ట్విటర్ ఎకౌంట్‌ను ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య 20 లక్షల మంది ఫాలోయర్ల మార్క్‌ను అందుకోవడం చర్చనీయాంశమైంది. 
 
నాగార్జున ఈ ఫీట్ సాధించడం ద్వారా మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మల వంటి వారి తర్వాత ఆ ఫీట్ అందుకున్న సెలబ్రిటీగా రికార్డు క్రియేట్ చేసాడు. అంతేకాదు నాగార్జున ట్విటర్ ఎకౌంట్‌కు చాలా వేగంగా 2 మిలియన్ల ఫాలోయిర్లు పొందడం హాట్ న్యూస్ అయ్యింది.

ప్రస్తుతం వరస హిట్ల పై దూసుకు పోతున్న నాగార్జున లేటెస్ట్ మూవీ 'ఓం నమో వెంకటేశాయ' ఆడియో ఫంక్షన్ ఈనెల 8వ తారీఖున జరగబోతోంది. ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న ఈసినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.