గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (12:13 IST)

చైతూ - సమంతల పెళ్లి కార్డులో నాగార్జున మొదటి భార్య పేరు! మరి అమల?

అక్కినేని నాగార్జున - అమల ఇంట పెళ్లి సందడి మొదలైంది. టాలీవుడ్‌లో పాటు ప్రేక్షకలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాగ చైతన్య సమంతల పెళ్లి వేడుక సమయం దగ్గర పడింది. నాగ చైతన్య, సమంతల పెళ్లి గోవాలో అక

అక్కినేని నాగార్జున - అమల ఇంట పెళ్లి సందడి మొదలైంది. టాలీవుడ్‌లో పాటు ప్రేక్షకలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాగ చైతన్య సమంతల పెళ్లి వేడుక సమయం దగ్గర పడింది. నాగ చైతన్య, సమంతల పెళ్లి గోవాలో అక్టోబర్ 6వ తేదీన జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు అంగరంగవైభవంగా చేస్తున్నారు.
 
ఇందుకోసం పెళ్లి కార్డులు ముద్రించి పంపిణీ కూడా చేయడం జరిగింది. అక్టోబర్ 6, 7న గోవాలో జరగబోతుందని పెళ్లి కార్డు‌లో పేర్కొన్నారు. అలాగే ఈ పెళ్లి కార్డులో ఓ ప్రత్యేకమైన విషయందాగుంది. నాగ చైతన్య తండ్రి నాగార్జున, తల్లి లక్ష్మి. వీళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు.
 
నాగార్జున అమలను చేసుకుంటే లక్ష్మి మాత్రం శరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడిపోయింది. అయినప్పటికీ కార్డులో నాగార్జున అండ్ అమల అని, లక్ష్మి అండ్ శరత్ అని ముద్రించారు. దీని బట్టి తెలుస్తోంది నాగార్జున విడిపోయిన కూడా మొదటి భార్యకు ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. విడిపోయాక కూడా ఆమె పేరునే కాదు ఆవిడ ప్రస్తుత భర్త పేరు కూడా కార్డులో ఇవ్వడం విశేషం.