శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2023 (15:19 IST)

మహేష్ బాబు పుట్టిన రోజు-హత్తుకునే చిత్రాన్ని పంచుకున్న నమ్రత

namrata
namrata
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 47వ పుట్టినరోజును తన కుటుంబ సభ్యులు, స్నేహితులు అభిమానుల హృదయపూర్వక శుభాకాంక్షల మధ్య జరుపుకుంటున్నారు. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఈ సందర్భంగా హత్తుకునే చిత్రాన్ని పంచుకున్నారు. తన భర్తకు తన ప్రేమను తెలియజేశారు. 
 
రాత్రి వేళ టెర్రస్‌పై ఉన్న మహేశ్‌ను వెనుక నుంచి హత్తుకున్న ఫొటో అది. "హ్యాపీ బర్త్ డే ఎంబీ.. ఈ రోజు, ప్రతి రోజూ నీవే, నీవే" అంటూ క్యాప్షన్ పెట్టింది. మహేష్ బాబు, నమ్రతల ఈ చిత్రం ఆన్‌లైన్‌లో సంచలనంగా మారుతోంది. మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్న సంగతి తెలిసిందే.