శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (16:37 IST)

నందమూరి బాలకృష్ణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షలు ప్రకటన

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna
నందమూరి బాలక్రిష్ణ యాభై ఏళ్ళ సినీకెరీర్ వేడుక ఇటీవలే జరిగింది. కాగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు తన వంతు సాయంగా 50 లక్షలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది.. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది.
 
తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
 
ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు., తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను.
 
రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. 
 
కాగా, సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు నాగ వంశీ, రాధాక్రిష్ణ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల సి.ఎం. నిధికి చెరో 25 లక్షలు ప్రకటించారు.