మెగా బ్రదర్ నాగబాబుకు థ్యాంక్స్ చెపుతున్న బాలకృష్ణ అభిమానులు.. ఎందుకంటే?
మెగా బ్రదర్ నాగబాబుకు నందమూరి బాలకృష్ణ అభిమానులు ధన్యవాదాలు చెపుతున్నారు. గుంటూరు వేదికగా జరిగిన ఖైదీ నంబర్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికపై నుంచి నాగబాబు మాట్లాడుతూ.. ఒక హిట్ సినిమాను ఆపలేరు
మెగా బ్రదర్ నాగబాబుకు నందమూరి బాలకృష్ణ అభిమానులు ధన్యవాదాలు చెపుతున్నారు. గుంటూరు వేదికగా జరిగిన ఖైదీ నంబర్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికపై నుంచి నాగబాబు మాట్లాడుతూ.. ఒక హిట్ సినిమాను ఆపలేరు. ఫ్లాప్ సినిమాను లేపలేరు అంటూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అన్నయ్య చిరంజీవి చిత్రం ఖైదీ నంబర్ 150వ చిత్రం గురించి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు
ఇపుడు నాగబాబు కామెంట్స్‌నే బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. "నాగబాబు సార్ ఈజ్ 100 శాతం కరెక్ట్. ఒక హిట్ సినిమాను ఆపలేరు. ఫ్లాప్ సినిమాను లేపలేరు. జై బాలయ్య" అన్న ఈ పోస్టును ఎవరు పెట్టారో ఏమో, గంట వ్యవధిలో వందల కొద్దీ షేర్లు, లైక్‌లు తెచ్చుకుని వైరల్ అయింది.