శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (13:12 IST)

'బాలకృష్ణుడు'గా నారా రోహిత్ అదరగొట్టేశాడు...

హీరో నారా రోహిత్ 'బాలకృష్ణుడు'గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా, ఈ స్టిల్స్‌లో నారా రోహిత్ అదరగొడుతున్నాడు. నిజానికి ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన కథలతో ప్రేక్షకు

హీరో నారా రోహిత్ 'బాలకృష్ణుడు'గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా, ఈ స్టిల్స్‌లో నారా రోహిత్ అదరగొడుతున్నాడు. నిజానికి ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి నారా రోహిత్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇటీవల వచ్చిన 'శమంతకమణి'.. 'కథలో రాజకుమారి' ఆయన అభిమానులను నిరాశ పరిచాయి. దాంతో తన తదుపరి సినిమా 'బాలకృష్ణుడు'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు.
 
పవన్ మల్లెల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా నారా రోహిత్ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాస్త సన్నబడి స్టైలీష్‌గా.. మరింత హ్యాండ్సమ్‌గా ఈ పోస్టర్‌లో నారా రోహిత్ కనిపిస్తున్నాడు. నారా రోహిత్ సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్న ఈ సినిమాలో రెజీనా కథానాయిక. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను వచ్చే నెలాఖరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.