బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (06:01 IST)

'మహానటి' కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ఫోటో లీక్..

అలనాటి హీరోయిన్ సావిత్రి జీవితంపై తెరకెక్కిస్తున్న చిత్రం "మహానటి". అయితే ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టర్‌లో కీర్తి సురేష్ నటిస్తుండగా, సమంత, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నా

అలనాటి హీరోయిన్ సావిత్రి జీవితంపై తెరకెక్కిస్తున్న చిత్రం "మహానటి". అయితే ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టర్‌లో కీర్తి సురేష్ నటిస్తుండగా, సమంత, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకైతే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మాత్రం విడుదల చేయలేదు. దీంతో సావిత్రిగా కీర్తి ఎలా కనిపించనున్నారో అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో మహానటి సెట్‌లో తీసిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సావిత్రి గెటప్‌లో కీర్తి అద్భుతంగా ఉంది. ఇక తెరపై ఎంతో చక్కగా కనిపించబోతున్నారు అని అందరి మదిలో నెలకొంది. మహానటికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
వైజయంతి మూవీస్‌ పతాకంపై ప్రియాంకా దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం‌, మలయాళ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, ప్రగ్యా జైశ్వాల్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.