శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (17:30 IST)

''ఇంద్రసేన''గా వస్తోన్న బిచ్చగాడు.. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ఫస్ట్ లుక్

''బిచ్చగాడు'' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోనీ.. తాజాగా ఇంద్రసేన అనే పేరిట కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో అన్నాదురై అనే పేరిట రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగులో ఇంద

''బిచ్చగాడు'' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోనీ.. తాజాగా ఇంద్రసేన అనే పేరిట కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో అన్నాదురై అనే పేరిట రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగులో ఇంద్రసేన పేరుతో తెరకెక్కుతోంది. 
 
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీద ఆవిష్కరించారు. ఈ చిత్రానికి నిర్మాతగా, రాధికా శరత్ కుమార్ వ్యవహరిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ప్రొడక్షన్ హౌస్‌తో పాటు రాధిక, శరత్ కుమార్ దంపతులు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో వుంది. శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. 
 
ఇంద్రసేన ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. తనకెంతో ఆప్తురాలైన మాజీ హీరోయిన్ రాధిక నిర్మించే చిత్రం సక్సెస్ కావాలని కోరుకున్నారు. సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోని కథానాయకుడిగా తన సత్తా చాటుకున్నాడనీ ప్రశంసించారు. ఇంద్రసేనకు విజయ్ ఆంటోనీ ఎడిటింగ్ కూడా చేస్తుండటం విశేషమని చిరంజీవి అన్నారు.