గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (11:26 IST)

జై లవ కుశలో స్వింగ్ జరా అంటున్న తమన్నా.. హాట్ లుక్ చూడండి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై భారీ స్థాయిలో రూపొందుకున్న సినిమా ''జై లవ కుశ''. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై భారీ స్థాయిలో రూపొందుకున్న సినిమా ''జై లవ కుశ''.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి యూ అండ్ ఎ సర్టిఫికేట్ లభించింది. తాజాగా జై లవ కుశలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇంకా ఈ పాట రిలీజ్ చేయకపోవడంతో, అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. 
 
ఈ నేపథ్యంలో పాట టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే ఈ లోగానే ఈ సాంగ్‌కి సంబంధించి తమన్నా హాట్ లుక్ బయటికి వచ్చేసింది. స్వింగ్ జరా అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో తమన్నా అదిరే స్టెప్పులేయనుందని టాక్. పోస్టర్ చూస్తే తమన్నా ఒక రేంజ్‌లో అందాలు ఆరబోసినట్టు తెలుస్తోంది. కాగా దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ స్పెషల్ సాంగ్ తప్పకుండా హిట్ అవుతుందని అప్పుడే సినీ పండితులు అంటున్నారు.