శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:53 IST)

నరేష్, పవిత్ర లోకేష్‌ల ''మళ్లీ పెళ్లి'' వాయిదా

Naresh and Pavitralokesh
Naresh and Pavitralokesh
పవిత్రలోకేష్ ను సీనియర్ నరేష్ సహజీవనం సాగిస్తున్న విషయం తెలిసిందే.  దీనిపై బెంగుళూర్ లో పెద్ద రచ్చ జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో క్రెజీ  న్యూస్ అయింది. కొంత కాలం మర్చిపోయారు అనుకుంటున్న టైములో పెళ్లి డ్రెస్సుతో పవిత్రలోకేష్ జి తాళి కట్టే ఫోటోలు బయట పడ్డాయి. ఇది చూపించి ‘మళ్లీ పెళ్లి’  ఇద్దరూ చేసుకుంటున్నారనే న్యూస్ ఆయన అనుచరగణం స్ప్రెడ్ చేసింది. ఆ తర్వాత అది సినిమాలో ఓ సీన్ అని తెలిపింది.
 
ఇక ఇప్పుడు మళ్లీ పెళ్లి’ టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాతో ఆయనకు నవరసరాయ బిరుదును తగిలించారు. డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్నారు. నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్లీ పెళ్లి’ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రానికి మెగా మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రం టీజర్ గురించి ఇంతకుముందు ఎక్సయిటింగ్ అప్‌డేట్‌తో వచ్చారు. టీజర్ ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. .కానీ టీజర్ కు కొన్ని సాంకేతిక కారణాల వల్ల  వాయిదా వేస్తున్నట్లు ఈరోజు ప్రకటనలో తెలిపారు. కాగా, ఈ సినిమాలోనే తాము ఎందుకు పెళ్లి చేసుకోవాల్చి వచ్చిందో తెలియజేయనున్నారని యూనిట్ చెపుతోంది. ఇది వెబ్ సిరీస్ కోసమే తీస్తున్నట్లు సమాచారం.