బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (12:28 IST)

జెంటిల్‌మన్ 2లో నయనతార చక్రవర్తి ఖ‌రారు

KT Kunjumon, Nayantharaa Chakravarthy
స్టార్ ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమన్ భారీ ప్రాజెక్ట్ జెంటిల్‌మన్ 2తో తిరిగి నిర్మాణ‌రంగంలోకి వ‌చ్చారు. ఇది అర్జున్ సర్జా, మధు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `జెంటిల్‌మన్‌`కి సీక్వెల్‌గా రూపొంద‌బోతోంది.
 
మలయాళంలో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిన నయనతార చక్రవర్తి జెంటిల్‌మన్ 2తో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. నటసింహ నందమూరి బాలకృష్ణ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో అతిధి పాత్ర పోషించిన త‌ర్వాత న‌య‌న‌తార చక్రవర్తి చేస్తున్న సినిమా ఇది.
 
ఈ సినిమాలో మరో కథానాయిక కూడా న‌టించ‌నున్నారు. ఎవరనేది త్వరలో వెల్లడికానుంది.
 
మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమన్ త‌న ట్విట్టర్‌లో ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ,  ప్రధాన నటిగా నయనతార చక్రవర్తిని పరిచయం చేస్తున్నాము. మరో కథానాయికను త్వరలో వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు.
 
ఎం.ఎం. కీరవాణి జెంటిల్‌మన్ 2కి సంగీతం అందించనున్నారు. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.