సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జులై 2023 (13:07 IST)

పోర్న్ వృత్తి చేశాను... పశ్చాత్తాపం లేదంటున్న సన్నీ లియోన్... నెటిజన్ల సపోర్టు

sunny leone
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రెండో దశ వారాహి యాత్రలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై వైకాపా మంత్రులు మండిపడుతున్నారు. ఇటీవల మంత్రి ఆర్కే రోజా కూడా ఘాటైన విమర్శలు చేశారు. 
 
ఈ క్రమంలో ఆమె నోరు జారారు. పవన్‌ను విమర్శించే క్రమంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్‍‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పవన్ నీతులు చెప్పడం సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లు ఉందంటూ కామెంట్స్ చేశారు. 
 
పవన్‌ను విమర్శించే తొందరలో సన్ని లియోన్‌ను తక్కువ చేసి మాట్లాడారు. మంత్రి రోజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ సన్నీకి సపోర్టుగా మంత్రి రోజాపై ఫైర్ అవుతున్నారు. పోర్న్ స్టార్ అయినా... తన జీవితాన్ని మార్చుకుని బాలివుడ్‌లో నటిగా కొనసాగుతున్నారని తెలిపారు.
 
ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్నారని నెటిజన్లు సన్నీ లియోన్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. పోర్న్ స్టార్ అని ఎగతాళి చేసిన వాళ్లే ఆమెతో కలిసి నటించారని, అవకాశాలిచ్చి పోత్సహించారని నెటిజన్లు అంటున్నారు.