బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (14:14 IST)

ట్రెండ్ సెట్టర్ : పవర్ స్టార్ కాదు.. ట్రెండింగ్ స్టార్‌గా పవన్

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరు వింటేనే యువతరు పూనకం వస్తుంది. ఆయన మాటే వేదం. అలాంటి పవన్ కళ్యాణ్ చేసినా, ఆయన పేరు మీద ఇతరులు ఏదైనా చేసినా అదో ట్రెండ్‌గా మారిపోతోంది. తాజాగా ఆయన మరోమారు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. 
 
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఓ అగ్రహీరో. రాజ‌కీయాల్లో బిజీగా ఉండి సినిమాల‌కు కాస్త బ్రేక్ తీసుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు వ‌రుస సినిమాల్లో 'వకీల్‌సాబ్'తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇది అయ‌న అభిమానుల‌కు సంతోష‌క‌ర‌మైన వార్త అనే చెప్పాలి. దీంతో సోష‌ల్ మీడియా ఆయ‌న అభిమానుల హంగామాకు హ‌ద్దే లేదు. 
 
అయితే, సెప్టెంబ‌రు నెల రెండో తేదీ పవన్ పుట్టిన రోజు. నెల‌న్న‌ర‌కు పైగానే స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ అభిమానులు మాత్రం సోష‌ల్ మీడియాలో ఇప్పుడే సంద‌డి మొద‌లెట్టేశారు. హ్యాపీ బ‌ర్త్ డే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ చేశారు. 
 
దేశంలోనే ట్విట్ట‌ర్ ట్రెండింగ్ స్టార్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంట‌ల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌తో 27.3 మిలియ‌న్స్ ట్వీట్స్ వ‌చ్చాయంటే అభిమానుల ఏ రేంజ్‌లో చేల‌రేగిపోయారో అర్థం చేసుకోవ‌చ్చు.