సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 జులై 2018 (17:27 IST)

''సైరా''లో నిహారిక.. గిరిజన అమ్మాయిగా కనిపిస్తుందా?

మెగాస్టార్ ''సైరా నరసింహారెడ్డి''కి కీలక షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌లను ఆగస్టులో రిలీజ్ చేస్తారని టాక్ వస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో ‘సైరా’

మెగాస్టార్ ''సైరా నరసింహారెడ్డి''కి కీలక షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌లను ఆగస్టులో రిలీజ్ చేస్తారని టాక్ వస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో ‘సైరా’ చేయడానికి నిర్ణయించుకున్నాడు. 
 
ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో ఓ బ్రహ్మాండమైన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. 
 
ఇకపోతే.. సైరాలో మెగాస్టార్‌తో పాటు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ నటులు విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ నటుడు సుదీప్‌లు నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక స్మాల్ క్యారెక్ట్ చేయనుందట. ఈ విషయాన్ని నిహారిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 
 
నిహారిక సైరాలో గిరిజన అమ్మాయి పాత్రలో కనిపించనుందని టాక్ వస్తోంది. సైరా తాను చిన్న రోల్ పోషిస్తున్నప్పటికీ.. మెగాస్టార్‌తో నటించడాన్ని అదృష్టంగా భావిస్తానని నిహారిక తెలిపింది. ప్రస్తుతం నిహారిక హ్యాపీ వెడ్డింగ్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా వుంది. ఇక నిహారిక హ్యాపీ వెడ్డింగ్ ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది.