మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 మే 2017 (10:12 IST)

ఎయిడ్స్ వ్యాధి సోకి చనిపోయిన కోలీవుడ్ సీనియర్ నటి ఎవరు?

తమిళ చిత్రపరిశ్రమలో ఒకప్పుడు అగ్రహీరోయిన్‌గా వెలుగొందిన నటి.. జీవితచరమాంకంలో ఎయిడ్స్ వ్యాధిన బారినపడి చనిపోయింది. ఆ నటి పేరు నిషా నూర్. తమిళ అగ్రనటులు కమల్ హాసన్, రజనీకాంత్ వంటివారి సరసన నటించిన ఈ ముద

తమిళ చిత్రపరిశ్రమలో ఒకప్పుడు అగ్రహీరోయిన్‌గా వెలుగొందిన నటి.. జీవితచరమాంకంలో ఎయిడ్స్ వ్యాధిన బారినపడి చనిపోయింది. ఆ నటి పేరు నిషా నూర్. తమిళ అగ్రనటులు కమల్ హాసన్, రజనీకాంత్ వంటివారి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ... తన నటనతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కమల్ హాసన్ నటించి 1981లో విడుదలైన "టిక్ టిక్ టిక్‌"తో పాటు 'కళ్యాణ అగదిగళ్' అనే తమిళ చిత్రాల్లో నిషా నూర్‌కు మంచి పేరు వచ్చింది.
 
ఆ తర్వాత ఆమెకు సినీ అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో డబ్బు సంపాదన కోసం వక్రమార్గాన్ని అనుసరించారు. ఈ వ్యవహారం కొంతకాలం గుట్టుచప్పుడు కాకుండా సాగినప్పటికీ.. మీడియా దృష్టిలో పడకుండా దాచలేక పోయింది. దీంతో అప్పటివరకు చేతిలో ఉన్న చిత్రాలే కాకుండా, సినీ అవకాశాలే రాకుండా పోయాయి. 
 
దీంతో తన జీవనం కోసం సెక్స్‌వర్కర్‌గా స్థిరపడిపోయింది. అలా స్థిరపడిన నిషా నూర్.. హెచ్‌ఐవీ బారిన పడింది. చివరకు 2005లో తమిళనాడులోని ఓ ఆశ్రమంలో చేరింది. అప్పటికే ఎయిడ్స్ వ్యాధి బాగా ముదిరిపోవడంతో చివరకు 2007లో కన్నుమూసింది. సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి.. చివరకు అదే చిత్ర పరిశ్రమ చేయివదిలిపెట్టడంతో డబ్బు కోసం తన శరీరాన్ని అమ్ముకుని ప్రాణాంతక వ్యాధి బారినపడి అనాథలా చనిపోయింది. 

ఇటీవలి కాలంలో పలువురు హీరోయిన్లు వ్యభిచార కేసుల్లో పట్టుబడటం, సినీ అవకాశాలు లేక అర్థాంతరంగా తనువు చాలిస్తుండటంతో నటి నిషా నూర్ విషాద గాధ మరోమారు చర్చల్లోకి వచ్చింది.