నిర్భంధ తమిళంపై మళ్లీ భయం భయం.. అమ్మను ప్రసన్నం చేసుకోవాల్సిందేనా!?
నిర్భంధ తమిళంపై మళ్లీ వివాదం రాజుకునేలా వుంది. అయితే ఈసారి ఈ వివాదం సర్దుబాటు అవుతుందా.. పోరుబాటకు దారి తీస్తుందా అనేది తెలియాల్సి ఉంది. గత ఏడాది ఆఖరి నిమిషంలో ''నిర్భంధ తమిళం'' జీవో పెను సంచలనానికి త
నిర్భంధ తమిళంపై మళ్లీ వివాదం రాజుకునేలా వుంది. అయితే ఈసారి ఈ వివాదం సర్దుబాటు అవుతుందా.. పోరుబాటకు దారి తీస్తుందా అనేది తెలియాల్సి ఉంది. గత ఏడాది ఆఖరి నిమిషంలో ''నిర్భంధ తమిళం'' జీవో పెను సంచలనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జోవో కారణంగా విద్యార్థులకు తలెత్తే ఇబ్బందులను గ్రహించిన హైకోర్టు.. గత విద్యా సంవత్సరానికి మాత్రం ఉపశమనం కల్పిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం చాలామంది విద్యార్థులు మాతృభాషల్లోనే పరీక్షలు రాశారు. అయితే ఈ పరీక్షల్లో చాలామందికి మార్కులు తగ్గాయి. కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు గత ఏడాదితో ముగియనుండటం ద్వారా విద్యార్థులు మళ్లీ టెన్షన్ పడుతున్నారు. ఈ వ్యవహారంపై అన్నాడీఎంకే సర్కారు తన పని తాను చేసుకుపోతుంది. ఇంకా తెలుగు వారంతా అన్నాడీఎంకే పార్టీకి మద్దతు తెలపడంతో భాష గురించి వారు పట్టించుకుంటారా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
ఇంకా నిర్భంధ తమిళం జీవో బారినపడకుండా ఉండాలంటే మైనారిటీ భాషా విద్యార్థులకు మేలు జరగాలంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కొందరు అంటుంటే.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ప్రసన్నం చేసుకుంటే.. పని సులభంగా అవుతుందని తెలుస్తోంది. మరి తెలుగు భాష కోసం ఎవరు పోరాడుతారో తెలియాల్సివుంది.
నిర్భంధ తమిళం జీవోకు సంబంధించి 2008త సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అందువల్ల ఈ సమస్యను తెలుగువారు అమ్మ దృష్టికి తీసుకెళ్తే బెటరని భాషా శాస్త్రవేత్తలు అంటున్నారు.