మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (12:06 IST)

ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి దండలు మార్చుకుంటుంటే.. చంద్రబాబు కూడా?

ఎన్టీఆర్‌తో కలిసున్న ఫోటోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్టు చేశాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నార

ఎన్టీఆర్‌తో కలిసున్న ఫోటోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్టు చేశాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం దగ్గర నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో వర్మ ఓ ఫొటోను అప్ లోడ్ చేశారు. 
 
ఆ ఫోటోలో ఎన్టీఆర్ వర్మకు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటో ఇది. ఈ ఫొటోలోనే చిన్న బాక్స్‌లో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలు దండలు మార్చుకుంటుండగా... వారికి సమీపంలో చంద్రబాబు నిలిచి ఉన్న ఫొటోను ఉంచారు. 'ఆయనపై సినిమా తీస్తున్నందుకు నన్ను ప్రశంసిస్తున్న ఎన్టీఆర్' అంటూ వర్మ కామెంట్ పెట్టారు.
 
మరోవైపు నాగార్జున హీరోగా తాను ఓ సినిమా చేస్తున్నట్టుగా రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. నాగార్జున కూడా వర్మతో ఒక సినిమా చేయనున్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను తెరకెక్కించడానికి కొన్ని రోజులుగా వర్మ సన్నాహాలు చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మీ ఎన్టీఆర్ ముందా.. నాగ్ సినిమా ముందా అని ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారు.
 
కానీ వర్మ మాత్రం నాగార్జునతో సినిమా చేశాకే.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ప్రారంభించాలనుకుంటున్నట్లు సమాచారం. నాగ్ సినిమా పూర్తయ్యాక ఫిబ్రవరి నుంచి వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీని మొదలెట్టనున్నారు. నాగార్జునతో తక్కువ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమాను రెండు నెలల్లోపు పూర్తి చేయాలని వర్మ భావిస్తున్నారు.