1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 16 ఏప్రియల్ 2025 (18:51 IST)

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

Yamadonga poster
Yamadonga poster
ఎన్.టి.ఆర్., రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం యమదొంగ.  2007లో విడుదలైన సోషియో ఫాంటసీ చిత్రమిది. మోహన్ బాబు, ఆలీ, మమతా మోహన్ దాస్, ప్రియమణి, నవనీత్ కౌర్, మాస్టర్ శ్రీ‌ సింహా నటించారు. మోహన్ బాబు యముడిగా, ఎన్.టి.ఆర్. మానవుడిగా వారిమధ్య సాగే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.  ఇప్పుడు మరలా ఇప్పుడు 8కె. ఫార్మెట్ లో విడుదల కాబోతుంది.

ఎన్.టి.ఆర్. జన్మదినం మే 20వ తేదీ. ఈ సందర్బంగా   మే 18, 19,20 తేదీల్లో మరోసారి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని మైత్రీమూవీస్ నిర్మాణ సంస్థ తెలియజేసింది.
 
మైత్రీ అధినేత చెర్రి, ఊర్మిళ నిర్మాతలుకాగా, రమా రాజమౌళి సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో మోహన్ బాబు పాత్ర కోసం రాజమౌళి ప్రత్యేక కసర్తతు చేశారు. ఆయన చేస్తేనే సినిమా చేయగలనని ఆ సందర్భంలో చెప్పారు. యముడుకి, ఎన్.టి.ఆర్.కు మధ్య యమలోకంలో సాగే డైలాగ్ లుకు మోహన్ బాబే మెచ్చుకోవడం విశేషం. ఇప్పుడు కొత్త వర్షన్ లో రాబోతున్న యమదొంగ మరోసారి సెస్సేషన్ క్రియేట్ చేస్తుందోమో చూడాలి.