ఆదివారం, 13 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 ఏప్రియల్ 2025 (20:15 IST)

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

trains
వేసవి సెలవులు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్టణం నుంచి బెంగుళూరు, తిరుపతి, కర్నూలు సిటీలకు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం ప్రత్యేక వీక్లీ రైళ్లను నడుపనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. 
 
విశాఖపట్నం - బెంగుళూరు ప్రత్యేక రైళ్లు (14 ట్రిప్పులు) 
రైలు నెంబర్ 08581 విశాఖపట్నం నుంచి ప్రతి ఆదివారం బయలుదేరింది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 08582 బెంగుళూరు నుంచి ప్రతి సోమవారం బయలుదేరింది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, జోలార్‌పేట, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్‌లో ఆగుతుంది. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. 
 
విశాఖపట్టణం - తిరుపతి ప్రత్యేక రైళ్లు (14 ట్రిప్పులు) 
రైలు నెంబర్ 08547 విశాఖపట్టణం నుంచి ప్రతి బుధవారం బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 08548 తిరుపతి నుంచి ప్రతి గురువారం బయలుదేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుంది. 2ఏసీ, 3ఏసీ, జనరల్ కోచ్‌లు ఉంటాయి.
 
విశాఖపట్టణం - కర్నూలు సిటీ ప్రత్యేక రైళ్లు (14 ట్రిప్పులు) 
రైలు నెంబరు 08545 ప్రతి మంగళవారం విశాఖపట్టణం నుంచి కర్నూలు సిటీకి బయలుదేరింది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబరు 08546 బుధవారం నాడు కర్నూలు సిటీ నుంచి బయలుదేరింది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాడమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కుంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్ స్టేషన్‌లలో ఆగుతుంది. 2ఏసీ, 3ఏసీ, జనవర్‌ కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకలు సమయాలను రైల్వేశాఖ త్వరలో వెల్లడించనుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ అధికారులు కోరారు.