చాలా గమ్మత్తుగా కొత్తపల్లిలో ఒకప్పుడువుంటుంది : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి
fani, benargjee, Praveena Paruchuri, manoj
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం ఫేమ్ నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది.
హీరో మనోజ్ చంద్ర మాట్లాడుతూ, ప్రవీణ పరుచూరి సినిమాల్లో నటించాలంటే నటిస్తే సరిపోదు జీవించాలి. అలా రామకృష్ణ క్యారెక్టర్ కి నేను ప్రాణం పోశాను. మీరందరూ కూడా ఈ సినిమాని ఆస్వాదిస్తారని భావిస్తున్నాను. తప్పకుండా థియేటర్స్ లోకి రండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యము అన్నారు.
డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ, ఇది నా మూడో సినిమా. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని అనుకున్నాను. ఒక పల్లెటూర్ని ఒక ఫారిన్ సినిమాటోగ్రాఫర్ తో షూట్ చేయించాం. ఈ సినిమాకి ఒక ఫారిన్ డీవోపీ పనిచేస్తున్నారు. నేను ఫస్ట్ సినిమా కేరాఫ్ కంచరపాలెం తీశాను. జీవితంలో ఒక్క సినిమా చాలు అనుకున్నాను. ఆ సినిమాకి ఆడియన్స్ చాలా పెద్ద విజయాన్ని ఇచ్చారు. ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకుల ప్రోత్సాహం వలన నేను మరో సినిమా తీయగలిగాను.
సినిమా చాలా గమ్మత్తుగా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు చాలా హాయిగా నవ్వుకుంటారు. సెకండ్ హాఫ్ లో నా స్టైల్ లో కొన్ని సెన్సిబిలిటీస్ కాన్సెప్ట్స్ ఉంటాయి. తప్పకుండా ఆలోచన కలిగించేలా ఉంటుంది. జులై 18న ఎవరు కూడా థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు అని కోరుకుంటున్నా. నేను ఈసారి నేను డైరెక్షన్ చేసిన సినిమా ఇది. మీ మీద నమ్మకంతోనే చేశాను. ఈ సినిమాని ఆదరిస్తారని మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది'అన్నారు.
బెనర్జీ మాట్లాడుతూ, అందరూ కూడా సినిమాని ఓన్ చేసుకున్నారు. ప్రవీణ కథనాన్ని ఒక నిర్మాతగా డైరెక్టర్ గా అద్భుతంగా నడిపించారు. ఈ సినిమా తప్పకుండా చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది అన్నారు