'పులి'తో యంగ్ టైగర్.. ఇది ఆ పులే అంటున్న హీరో
ఆస్కార్ వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సందడి చేశాడు. నల్లని బాంద్‌గలా సూట్‌పై బంగారం వర్ణంతో మెరిసిపోతున్న ఎంబ్రాయిడరీ పులితో ఉన్న దుస్తులను ధరించారు. ఈ పులి ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది.
ముఖ్యంగా, నల్లని బాంద్‌గలా సూట్‌పై బంగారం రంగులో మెరిసిపోతున్న ఎంబ్రాయిడరీ పులితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలకు వస్తుంటే, ప్రతి ఒక్కరి చూపు, ప్రత్యేకంగా మీడియా దృష్టంతా అతనిపైనే కేంద్రీకృతమైంది. దుస్తులపై ఉన్న పులిని గమనించిన ఓ పాత్రికేయురాలు యంగ్ టైగర్ వద్దకు వెళ్లి ఆ పులి కథేంటి అంటూ ప్రశ్నించారు. దీనికి ఎన్టీఆర్ సరదాగా సమాధానం చెప్పారు.
మీరు ఆర్ఆర్ఆర్ సినిమా చూశారు.. అందులో నా మీదకు దూకిన పులి ఇదే అని నవ్వుతూ సమాధానమిచ్చారు. రాజమౌళి ప్రతిభావంతుడు. హాలీవుడ్ చిత్రాలకు పని చేసే సత్తా ఉన్న దర్శకుడు. త్వరలోనే అతన్ని ఆ స్థాయిలో చూస్తాను అని ఎన్టీఆర్ చెప్పాడు.