గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ఆస్కార్ 2023 : బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో "నాటు నాటు"కు గ్రామీ అవార్డు

natu natu best origional song
ఆస్కార్ 2023 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. హాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, తారలతో పాటు ఈ యేడాది నామినేషన్లలో ఉన్న సినీ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినీ సంబరానికి హాజరయ్యారు. హాలీవుడ్ తారామణులు తమ అందాలను ఆరబోస్తూ అదిరిపోయే దుస్తుల్లో దర్శనమిచ్చారు. 
 
ఇక భారతీయ సినీ ప్రేక్షకుల కలలను నిజం చేస్తూ "ఆర్ఆర్ఆర్" చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. అలాగే, భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ "ది ఎలిఫెంట్ విస్పరర్స్" చిత్రం సొంతం చేసుకుంది.
 
'నాటునాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఉత్తమ పాటగా అవార్డును దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీపడిన 'అప్లాజ్' (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), 'లిఫ్ట్ మి ఆఫ్' (బ్లాక్ ఫాంథర్ - వకాండా ఫెరవర్), 'దిస్ ఈజా ఏ లైఫ్' (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్స్ వన్స్), 'హాల్డ్ మై హ్యాండ్' (టాప్ గన్ మూవెరిక్) వంటి పాటలను వెనక్కి నెట్టి ఆస్కార్ అవార్డును దక్కించుకుంది.
rrr team
 
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట పేరును ప్రకటించగానే డాల్ఫీ థియేటర్ కరతాళ ధ్వనులతో దద్ధరిల్లిపోయింది. ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ఆనందోత్సవాల్లో మునిగిపోయింది.