శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (09:53 IST)

ఫిదా, అత్తారింటికి దారేది సినిమాలు అదుర్స్.. పరుచూరి గోపాలకృష్ణ (Video)

ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రశంస జల్లు కురిపించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ''ఫిదా", మూడేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో విడుదలైన ''అత్తారింటి

ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రశంస జల్లు కురిపించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ''ఫిదా", మూడేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో విడుదలైన ''అత్తారింటికి దారేది'' చిత్రాల గురించి ప్రస్తావించారు. అత్తారింటికి దారేది క్లైమాక్స్‌లో పవన్ కల్యాణ్ నటించిన తీరు అద్భుతమని కొనియాడారు. హేట్సాఫ్ టూ పవన్ కల్యాణ్. ఎందుకంటే, అంత మాస్ ఇమేజ్ ఉన్న ఓ హీరో కన్నీరు పెట్టుకుంటూ అత్తను బతిమాలాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. 
 
చెట్టుకు విత్తనంలాగా, కథకు ఒక ఆలోచన వస్తే, అది కథాంశంగా ఎలా డెవలప్ చేస్తారనే విషయాన్ని పరుచూరి పాఠాల్లో ప్రముఖ రచయిత గోపాలకృష్ణ తెలిపారు. ఫిదా గురించి పరుచూరి ఇంకా మాట్లాడుతూ.. 'ఫిదా' సినిమాలో ఒకమ్మాయి మొగుడి వెంటే ఎందుకు వెళ్లాలి, మగాడు భార్య వెంట ఎందుకు రాకూడదు అనే సామాజిక అంశాన్ని హీరోయిన్ వాళ్ల అక్కని ప్రశ్నించింది. అది ఫిదా కథాకి బీజం. ఒకమ్మాయికి నేనెందుకు భర్త వెంట వెళ్లాలి. భర్తే నా వెంట రావాలి అనేదే ఆ అమ్మాయి ఆలోచనతో అద్భుత ప్రేమ కథా చిత్రంగా చూపించారని ప్రశంసించారు.