శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (22:57 IST)

వకీల్ సాబ్‌కు అరుదైన రికార్డ్... IMDB Rankingsతో బిగ్ బిని బీట్ చేశాడోచ్! (video)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా మరో అరుదైన రికార్డు అందుకుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మించాడు. నివేదా థామస్, అంజలి ప్రధాన పాత్రలు చేయగా, శృతి హాసన్ పవన్ భార్యగా క్యామియో రోల్‌లో కనిపించారు. ఇక థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.  
 
తాజాగా ప్రముఖ సినిమా రేటింగ్ సంస్థ ఐఎమ్‌డిబి వకీల్ సాబ్ చిత్రానికి భారీ రేటింగ్ ఇవ్వడం జరిగింది. వకీల్ సాబ్ ఒరిజినల్ వర్షన్ పింక్ కంటే కూడా పవన్ మూవీ ఎక్కువ రేటింగ్ సాధించింది. 
 
అమితాబ్ నటించిన హిందీ మూవీ పింక్ 75.5 రేటింగ్ అందుకోగా, వకీల్ సాబ్ 84.4 రేటింగ్ దక్కించుకోవడం విశేషం. అమితాబ్ పింక్ కంటే పవన్ వకీల్ సాబ్ దాదాపు పది పాయింట్స్ అధికంగా సాధించడం విశేషం. రేటింగ్‌లో ఒరిజినల్... వర్షన్‌కి మించి రీమేక్ ఎక్కువ స్కోర్ రాబట్టడం విశేషమే అనే చెప్పాలి.