బందిపోటుగా పవన్ కళ్యాణ్!
ఒకవైపు రాజకీయాల్లో బిజీగా వుంటూనే మరోవైపు సినిమాలవైపు కూడా బిజీగా వున్నారు పవన్ కళ్యాణ్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న హరిహరవీరమల్లు ఆయన తాజా సినిమా. ఇందులో తాజా షెడ్యూల్ కోసం ఏప్రిల్ ఒకటి నుంచి షూట్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూట్ చేశాక గేప్ తీసుకున్నారు.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. భారత్‌లోని 17వ శతాబ్దం నాటి కథ. మొగలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథ. ఇందులో పవన్ గజదొంగగా కన్పిస్తున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం షూట్ చేయనున్నారు ఇప్పటికే సగ భాగం షూట్ పూర్తయిన ఈ చిత్రం తాజా షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లో సెట్ వేస్తున్నారు. నిధి అగర్వాల్ నాయిక. అర్జున్ రామ్‌పాల్‌తోపాటు పలువురు నటిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.