గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (12:59 IST)

భవదీయుడు భగత్ సింగ్... పవన్ సరసన పూజా హెగ్డే

Pooja Hegde_Pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో హరీష్ శంకర్‌తో కలిసి 'భవదీయుడు భగత్ సింగ్` అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. శుక్రవారం జరిగిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ఆ అప్ డేట్ ను లీక్ చేశారు.
 
ఆయన మాట్లాడుతూ 'పూజా హెగ్డే సమర్ధవంతమైన నటి అని నేను నమ్ముతున్నాను, పవన్ కళ్యాణ్ నటించిన 'భవదీయుడు భగత్ సింగ్`లో ఆమె హీరోయిన్‌గా నటిస్తుందని తెలిపారు`. దాంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. పూజా హెగ్డే, పవన్ కళ్యాణ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. కాగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.