1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (21:02 IST)

వివాదంలో చిక్కుకున్న రిపబ్లిక్ సినిమా.. ఏమైంది?

దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన రిపబ్లిక్ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినమాలోని కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ ఏపీలోని కొల్లేరు సరస్సు ప్రాంతీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తామంతా కొల్లేరుపై (కొల్లేరు లేక్) ఆధారపడి జీవిస్తుంటే ఆ సినిమాలో విషపూరిత రసాయనాలతో అక్కడ చేపల సాగు చేస్తున్నట్టుగా చూపించారన్నారు. దీని వల్ల తమ జీవనోపాధి దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
సినిమా యూనిట్‌పై జిల్లా కలెక్టర్, ఎస్పీకు ఫిర్యాదు చేశారు. సినిమా యూనిట్ వెంటనే స్పందించి కొల్లేరుపై చిత్రీకరించిన సన్నివేశాల్ని తొలగించాలని కోరారు. లేనిపక్షంలో కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.