1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (20:46 IST)

దేవకట్టాతో పవన్ సినిమా.. స్ట్రాంగ్ సబ్జెక్టుతో వచ్చేస్తున్నాడు..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన "రిపబ్లిక్" సినిమాకి దర్శకత్వం వహించిన దేవకట్టా మంచి విజయాన్ని అందుకున్నారు. పొలిటికల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "రిపబ్లిక్" బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంటోంది. 
 
తాజా సమాచారం ప్రకారం దేవకట్టా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం దేవకట్ట ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ని రాయటం మొదలు పెట్టారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి దగ్గరగా ఉండే స్క్రిప్ట్‌ని రాయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దేవకట్టా. 
 
ఇప్పటికే "ప్రస్థానం" వంటి హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన దేవకట్టా పవన్ కళ్యాణ్ కోసం కూడా అలాంటి ఒక స్ట్రాంగ్ సబ్జెక్టుతో వస్తారని అభిమానులు కూడా నమ్ముతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయ పనులతో మాత్రమే కాకుండా మరోవైపు "భీమ్లా నాయక్" మరియు "హరిహర వీరమల్లు" సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.