సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (17:20 IST)

భీమ్లా నాయక్ లో అంత ఇష్టం - రెండో సింగిల్‌కు సిద్ధ‌మ‌యింది

Nithya- pawan
పవన్ కళ్యాణ్, నిత్య‌మీన‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా భీమ్లా నాయక్. రానా దగ్గుబాటి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈనెలాఖ‌రులో చివరి షెడ్యూల్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్‌ను ఈనెల 15న విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. `అంత ఇష్టం` అనే సాంగ్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. నిత్య‌మీన‌న్‌, ప‌వ‌న్ క‌లిసి వున్న స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
 
ఇదిలా వుండ‌గా, పవన్ రాజకీయాలతోనూ బిజీగా ఉండటంతో చిత్రీక‌ర‌ణ  ఆలస్యం అవుతోంది. ఇప్పటికే పవన్ కు సంబందించిన ప్రధాన పార్ట్ ను పూర్తిచేసుకున్నాడు. రానాతోపాటు సంయుక్త మీనన్‌ సన్నివేశాలను తెరకెక్కించాల్సి వుంది. ఈ చిత్రం షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి, అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకుడు.  త్రివిక్రమ్ సంభాషణలు & స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సంగీతం థమన్ అందిస్తున్నారు. జనవరి 12న విడుదల కానుంది.