1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

the100 movie
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ది 10 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేశాడు. ఆర్కే సాగర్ హీరోగా, మిషా నారంగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 11వ తేదీన విడుదలకానుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానరుపై రమేశ్ కరుటూరి, వెంకీ పూశడపులు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, పాటలకు ఇప్పటికే విడుదలకాగా, వాటికి విశేషమైన స్పందన వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. "జీవితంలో జరిగిపోయింది మన మర్చిపోలేం. కానీ, జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపొచ్చు" అంటూ సాగే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో ఐపీఎస్ విక్రాంత్ పాత్రలో ఆర్కే సాగర్ నటించారు. 
 
'ఆయుధం చేతపట్టకూడదని తనకి తానుగా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఐపీఎస్ అధికారి విక్రాంత్. అప్పటి నుంచి ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు.. తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ ఆయుధం చేతపట్టడానికి అవసరం ఎందుకు వచ్చింది?. ఆ తర్వాత ఏం జరిగిందనే' విషయాలతో ఈ చిత్రం తెరకెక్కింది.