మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 31 డిశెంబరు 2018 (12:15 IST)

సంక్రాంతికి ''పేట''లో కలుస్తా.. అప్పటి వరకు హ్యాపీ న్యూయర్ (వీడియో)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించి సంక్రాంతికి సిద్ధమవుతున్న పేట సినిమా స్పెషల్ ట్రైలర్ విడుదలైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా జనవరి పదో తేదీన విడుదల కానుంది. 


తాజాగా తమిళ ట్రైలర్‌ను విడుదల చేసిన సినీ యూనిట్, తాజాగా తెలుగులో ఓ స్పెషల్ ట్రైలర్‌ను వదిలారు. ఈ ట్రైలర్‌లో చూస్తారుగా కాలి ఆటను.. సంక్రాంతికి పేటలో కలుస్తా.. అప్పటి వరకు హ్యాపీ న్యూయర్ అంటూ రజనీకాంత్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. 
 
ఈ స్పెషల్ ట్రైలర్‌లో సిమ్రాన్, త్రిషలతో పాటు విజయ్ సేతుపతి, బాబీ సింహా, శశికుమార్, నవాజ్ సిద్ధిఖీలను కూడా చూపించి కట్ చేశారు. త్వరలో ట్రైలర్ విడుదల కానుందని ఈ స్పెషల్ ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. రజనీకాంత్ ఈ సినిమాలో మరింత యంగ్ గా .. స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ స్పెషల్ ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.