మంగళవారం, 12 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (13:30 IST)

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ వుంటుంది.. ప్రధాన మంత్రి శుభాకాంక్షలు

rrrforoscars
ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై గురించి జక్కన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ రానుందని జక్కన్న కీలక ప్రకటన చేశారు. చిత్రాన్ని కొనసాగించేందుకు ఓ అద్భుతమైన ఆలోచన తట్టిందని ప్రకటించారు. దాన్ని స్క్రిప్ట్ గా డెవలప్ చేసే పనిలో వున్నట్లు ధ్రువీకరించారు. ఆర్ఆర్ఆర్ బంపర్ ఆఫర్ కొట్టడంతో ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
సినిమా విడుదలై ఇంత గొప్ప ఆదరణ పొందినప్పుడు తాము సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చిందని.. తమకు కొన్ని మంచి ఐడియాలు వచ్చాయని చెప్పారు. అయితే బలవంతంగా సీక్వెల్ తీయకూడదని అనుకున్నట్లు తెలిపారు. పాశ్చాత్య దేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ కు మంచి ఆదరణ చూసిన తర్వాత కొన్ని వారాల క్రితం ఈ ఐడియా వచ్చిందని చెప్పుకొచ్చారు. స్క్రిప్ట్ పూర్తయ్యే వరకు సీక్వెల్ విషయంలో తాము ముందుకు వెళ్లబోమని.. ప్రస్తుతం అందరూ ఆ పని మీదే వున్నామని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందని చెప్పుకొచ్చారు.  ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 
 
కాగా జక్కన్న సోదరుడు ఎంఎం కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాటకు.. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన ప్రదానోత్సవంలో కీరవాణి అవార్డు అందుకున్నారు.