బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (19:46 IST)

రాజ‌కీయాలంటే వ్యాపార‌మే అంటోన్న ఎల్‌కెజి

LKG poster
భార‌త్ రాజ‌కీయాలంటే నాయ‌కులంటే ఎంత పేరో అంద‌రికీ తెలిసిందే. బ్రిటీష్ వారే భార‌తీయుల‌కు పాల‌న తెలీదు అని స్వాతంత్రం ఇచ్చేముందు అన్నారు. ఇది చ‌రిత్ర‌. అప్ప‌ట్లోనే యు.కె. అధ్య‌క్షుడు విన్ స్ట‌న్‌ చర్చిల్ కూడా రాజ‌కీయాలు అనేవి గేమ్‌కాదు. వ్యాపారం అన్నాడు. మ‌రి ఆయ‌న్ను ఫాలో అవుతూ న‌డుస్తున్న రాజ‌కీయాలు `ఇలా ఇంకెన్ని రోజులు దోచెను జాతిని మ‌న భ‌ర‌త‌జాతిని` అంటూ ఓ పాట రూపంలోనూ `ఎల్‌.కె.జి.` సినిమాలో పెట్టారు. ఇది త‌మిళ సినిమా. తెలుగులోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు. అప్ప‌ట్లో క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన `పంచ‌తంత్రం`లో అమాకుడిగా న‌టించిన తమిళ నటుడు ఆర్జే బాలాజీ న‌టించిన సినిమా ఇది.
 
మంగ‌ళ‌వారంనాడు తెలుగు చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఇది స‌మ‌కాలీన పొలిటికల్ సెటైర్ మూవీ. ఇది 2019 ఫిబ్రవరిలో విడుదలైన ఈ తమిళ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆర్జే బాలాజీ ముఖ్యమంత్రిగా నటించాడు. ప్రియా ఆనంద్, జెకె రితేష్, నంజిల్ సంపత్ కీలకపాత్రలు పోషించారు. కేఆర్ ప్రభు దర్శకత్వం వహించారు. చిత్రానికి ఆర్జే బాలాజీ స్క్రీన్ ప్లే, కథ అందించగా, లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. ఇషారీ కె గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి విడుదలకు సిద్ధం అవుతోంది. అదికూడా తెలుగు భాషలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి ఓటిటి వేదిక ఆహాలో జూన్ 25 నుంచి ఈ చిత్రం ప్రసారం కానున్నట్టు తాజాగా ప్రకటించారు మేకర్స్.