శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (13:57 IST)

అల్లు అర్జున్ ఎనర్జీ లెవెల్స్ అదుర్స్.. ఇరగదీశాడు.. తట్టుకోలేకపోయా? : పూజా హెగ్డే

'డీజే - దువ్వాడ జగన్నాథమ్‌' హీరో అల్లు అర్జున్‌పై ఆ చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే ప్రశంసల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ ఎనర్జీ లెవెల్స్ అదుర్స్, అని ఈ చిత్రంలోని పాటల కోసం డ్యాన్స్ ఇరగదీశాడంటూ ఆమె కి

'డీజే - దువ్వాడ జగన్నాథమ్‌' హీరో అల్లు అర్జున్‌పై ఆ చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే ప్రశంసల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ ఎనర్జీ లెవెల్స్ అదుర్స్, అని ఈ చిత్రంలోని పాటల కోసం డ్యాన్స్ ఇరగదీశాడంటూ ఆమె కితాబిచ్చింది.
 
హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన డీజే ఆడియో వేడుక ఆదివారం జరిగింది. ఇందులో పూజా హెగ్డే మాట్లాడుతూ అల్లు అర్జున్ నుంచి నటనలో టిప్స్ నేర్చుకున్నానని చెప్పింది. సినిమాలో అల్లు అర్జున్‌తో డాన్స్ చేసినప్పుడు చూశానని, ఆయన చాలా అద్భుతమైన డాన్సర్ అని, అందుకే తాను తెలుగు మైఖేల్ జాక్సన్ అని అంటానని చెప్పుకొచ్చింది.
 
ఈ సినిమాలో తన ఫేవరేట్ సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడని తెలిపింది. తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ లకు ధన్యవాదాలు తెలిపింది. తెలుగు అభిమానులు చాలా ఎనర్జిటిక్ అండ్ సూపర్ అని అభినందించింది.