గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (14:58 IST)

నాని కోసం పవన్ కళ్యాణ్ - విడుదలకు ఒక్క రోజు ముందుగా..

ante sundaraaniki
నేచరుల స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్‌గా నటించిన చిత్రం "అంటే.. సుందరానికీ". ఈ నెల పదో తేదీన తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో ఈ నెల 8వ తేదీన ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని తొలుత భావించారు. 
 
కానీ, ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. దీంతో ఆయన కోసం ఒక్క రోజు ఆలస్యంగా ఈ వేడుకను నిర్వహించేలా ప్లాన్ చేశారు. అంటే విడుదలకు ఒక్క రోజు ముందు ఈ ప్రిరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేలా ప్లాన్ చేశారు. హైటెక్ సిటీలోని శిల్ప కళా వేదికలో దీన్ని నిర్వహించనున్నట్టు అధికారింగా వెల్లడించారు. 
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాని, నజ్రియాతో పాటు నరేష్, నదియా, హర్భవర్థన్, రాహుల్ రామకృష్ణ, సుహాన్ తదితరుల నటించార. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు.