ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (08:00 IST)

కామన్వెల్త్ క్రీడల విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రభాస్

Prabhas thanks poster
Prabhas thanks poster
దేశం గర్వించే ప్రతి సందర్భంలో తన శుభాకాంక్షలు తెలిపేందుకు ముందుంటారు పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ డార్లింగ్ ప్రభాస్. దేశానికి పేరు తెచ్చే ప్రతి ఒక్కరి పట్ల ప్రోత్సాహకరంగా స్పందిస్తుంటారు. ప్రస్తుతం ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో దేశం తరుపున పతకాలు సాధించిన క్రీడాకారులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్ స్టాగ్రామ్ లో భారత క్రీడా వీరులు సాధించిన పతకాల పట్టికను పోస్ట్ చేస్తూ తన గ్రీటింగ్స్ తెలిపారు.
 
"కామన్వెల్త్ క్రీడల విజేతలందరికీ కంగ్రాట్స్.  మీరు సాధించిన విజయాలతో దేశం గర్విస్తోంది. భారత్ కు మెడల్స్ సాధించడంలో మీరు చూపించిన పట్టుదల, అంకితభావం చాలా గొప్పవి" అంటూ థాంక్స్ నోట్ పోస్ట్ చేశారు. 
 
బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దేశంలో ఏ ప్రాంతం వారికైనా ఆయన బాహుబలిగా అభిమాన హీరో అయ్యారు. ఈ ఇమేజ్ కు అనుగుణంగానే ప్రస్తుతం ఆయన ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, స్పిరిట్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.